నీ పిలుపుకై!!!
నా చెంత లేవన్న చింతలేదుత్వరలో వస్తావన్న ఆశా లేదు
కంటికెదురుగా లేవన్న భాధలేదు
నాలోనే నీవున్నావని నేచెప్పలేదు.
ప్రతి ఉఛ్వాస నిఛ్వాసలో నిన్నే తలుస్తున్నా
శ్వాస లేనిదే జీవితం లేదని మొరపెట్టుకున్నా
నీ తలపు తరువాతే శ్వాసాడుతుంది ఎంత వద్దంటున్నా
నీ నవ్వులో నే కోరినలోకం ఉందని మనస్సంటున్నా
కలసి జీవించలేక పోతున్నామని కలవర పడుతున్నా.
నీ చెంత నేను లేనని చింత ఏలా??????
కనులుమూసి తలచుకో కంటికెదురుగా ఉంటాను కలలా
నీవు నన్ను కలవమని పంపించు కబురు ఎలాగోలా
చితి నుండి అయినా లేచివస్తాను గాలిలో ధూళిలా.........